భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అగ్ర హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే థియేటర్లలో వచ్చే కిక్ కోసం ఇద్దరు అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ఈ పల్స్ ను పట్టుకునే యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) తమ ‘స్పై యూనివర్స్’ ను భారీ ప్లాన్లతో ముందుకు తెచ్చింది. ఒకే కథ ప్రపంచంలోకి స్టార్ హీరోలను తీసుకురావడం చాలా బాగుంది. కానీ రీసెంట్ గా వచ్చిన ‘ఆల్ఫా’ మూవీతో సహా ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల మేకింగ్ చోట, ఎక్కడో ఒక అసలైన కంటెంట్ మిస్ అవుతోందనే టాక్ వినిపిస్తోంది.
ఈ సిరీస్లో వచ్చిన ప్రాజెక్టుల అనౌన్స్ మెంట్లు, హీరోల కాంబినేషన్లు చూసినప్పుడు ప్రేక్షకుల అంచనాలు హై రేంజ్కి వెళుతున్నాయి. అయితే ఆ తర్వాత థియేటర్లలో కనిపించే ఎగ్జిక్యూషన్ మాత్రం ఆ రేంజ్ హైప్ ను నిలబెట్టలేకపోతోంది. రీసెంట్ గా రిలీజైన ‘ఆల్ఫా’ సినిమానే దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఆలియా భట్, శర్వరి లాంటి క్రేజీ కాస్టింగ్, హృతిక్ రోషన్ క్యామియో సినిమా అనుకున్న రేంజ్ ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఏదో స్టార్ హీరోల డేట్లను సెట్ చేయడం, వారి ఇమేజ్ తగ్గట్టుగా భారీ యాక్షన్ సీక్వెన్సులు ప్లాన్ చేయడం పైనే మేకర్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు.
వందల కోట్ల బడ్జెట్ తో స్క్రీన్ పై గ్రాండియర్ ను చూపిస్తున్నప్పటికీ, స్క్రిప్ట్ లో ఉండాల్సిన అసలైన బలం లోపిస్తోందని సినిమా లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఒక పక్కా స్పై థ్రిల్లర్ సినిమాకు కావలసింది కేవలం గన్ ఫైట్లు, భారీ ఛేజింగులు మాత్రమే కాదు. మైండ్ గేమ్స్, ఊహించని ట్విస్టులు, రీడబుల్ స్క్రీన్ ప్లే ఉంటేనే ఆ జోనర్ కు పూర్తి న్యాయం జరుగుతుంది. హాలీవుడ్ తరహాలో ఒక పెద్ద యూనివర్స్ ను క్రియేట్ చేయాలనే మేకర్స్ ఆలోచనను అభినందించినమే అయినా, దాన్ని సరైన ఎమోషన్ తో స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంలో స్పష్టత కొరవడుతోంది.
గతంలో వచ్చిన టైగర్ 3, వార్ 2 నుంచి మొన్నటి ఆల్ఫా వరకు కథనంలో దమ్ము లేనప్పుడు ఎంత పెద్ద కాంబినేషన్ సెట్ చేసినా అది కేవలం హడావుడిగానే మిగిలిపోతుంది. వరుసగా వస్తున్న సినిమాల ఎగ్జిక్యూషన్ లో లోపాలు కనిపిస్తున్నాయి, భవిష్యత్తులో రాబోయే లైనప్ ప్రాజెక్ట్స్ పై కూడా నెటిజన్లలో నమ్మకం తగ్గుతోంది. రైటింగ్ డిపార్ట్మెంట్ పై సరైన శ్రద్ధ పెట్టకుండా, కేవలం కాంబోల క్రేజ్ తోనే థియేటర్లకు జనాన్ని రప్పించలేమని మేకర్స్ గ్రహించాల్సిన సమయం వచ్చింది. భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ సక్సెస్ అవ్వాలంటే, స్టార్ ఇమేజ్ కంటే కథల క్వాలిటీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

