విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. కార్మికులు, యాజమాన్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి, స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం గతంలో ఎప్పుడూ జరగలేదు. 30 ఏళ్లలో ఇలాంటి ఘటనను మేము ఎప్పుడూ చూడలేదని అన్నారు..విశాఖ ఉక్కును కాపాడటమే కాదు ఉత్పత్తిని కూడా తిరిగి ప్రారంభించామని, ఇలాంటి సమయంలో స్టీల్ ప్లాంట్‌లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని. ఎప్పుడూ లేనివిధంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగమిస్తామని, కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడేందుకు ఎన్డీయే అడుగేసింది. ఒక్కో కుటుంబం చూస్తే చాలా బాధ వేస్తోందని, కార్మికుల కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి లోకేష్ చెప్పారు..

