చెన్నైలో జరిగిన ‘స్లామ్‌డాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన షేర్ చేసిన విషయాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “పూరి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన తెలుగులో తీసిన సూపర్ హిట్ చిత్రం ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ని కోలీవుడ్‌లో జయం రవి హీరోగా నటించాను.
పూరి జగన్నాథ్ వర్కింగ్ స్టైల్‌ను కొనియాడుతూ.. “పూరి క్షణాల్లో కథలు చెబుతారు. ఆయన చెప్పే ప్రతి లైన్, ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. దర్శకుడిగా ఆయనకు ఏం కావాలో చాలా స్పష్టత ఉంటుంది. అలాంటి మేకర్‌తో పనిచేయడం ఏ నటికైనా చాలా ఈజీగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. సేతుపతి ధీమా వ్యక్తం చేశారు.

