వెల్దుర్తి: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నరసన్నపల్లి శివారులోని స్విమ్మింగ్ ఫూల్లో మునిగి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మృతి చెందాడు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న కామారెడ్డికి చెందిన చింతకింది శ్రీనివాస్(43) నరసన్నపల్లి శివారులోని స్విమ్మింగ్ ఫూల్లో గురువారం సాయంత్రం తన కుమారుడితో కలిసి ఈత కొడుతూ నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటనపై ఆయన భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

