– ప్రకటన –
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్
నవతెలంగాణ – మల్హర్ రావు
వివిధ రంగాల్లో పనులు చేస్తున్న హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాత రాజు సతీష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన తాడిచర్లలో హమాలీ కార్మికుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వీరిని కార్మికులుగా గుర్తించకుండా స్వయం ఉపాధి వ్యక్తులుగా కోరుతున్నారు.
పని చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు విరిగి చనిపోయిన పట్టించుకునే వారే లేరన్నారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు ఎక్షగ్రేషియా ఇవ్వాలి,50సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సోతుకు ప్రవీణ్, మండల కార్యదర్శి పన్నాల కుమారస్వామి, హమాలీ కార్మికులు రాజయ్య, సమ్మయ్య, కుర్రి రాజయ్య, జి. ఐలయ్య, సేన రవి ఉన్నారు.
– ప్రకటన –

