హాకీ ప్రపంచకప్ 2026 టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. 20 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం. డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
ఆగస్ట్ 15 నుంచి 30 వరకు జరగనున్న పురుషుల హాకీ ప్రపంచకప్ టోర్నీకి బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇంటివల లండన్ వేదికగా జరిగి ప్రో హాకీ లీగ్‌లో భారత్ 24 మంది బరిలోకి దిగింది. కానీ ప్రపంచకప్ జట్టు రూల్స్ ప్రకారం 20 మందికి మాత్రమే అనుమతి ఉండటంతో నలుగురు చోటు కోల్పోయారు. డిఫెండర్ అమన్‌దీప్ లక్రా మిడ్‌ఫీల్డర్లు రాజ్‌కుమార్ పాల్, రబిచంద్ర సింగ్, మొయిరాంగ్థెమ్, ఫార్వర్డ్ సెల్వం కార్తీ ఉద్వాసనకు హాజరయ్యారు.
ఫోటో క్రెడిట్: X (twitter)
ఈ హాకీ ప్రపంచకప్‌లో పూల్ డీలో ఉన్న భారత్ ఆగస్ట్ 15న వేల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. 17న ఇంగ్లండ్, 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. చివరగా 2023లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ 9వ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఒక్కసారి మాత్రమే విజేతగా నిలిచింది. 1975లో పాక్‌ను ఓడించి టైటిల్ అందుకుంది. తర్వాత ఒక్క పతకం కూడా సాధించలేదు. 1971లో బ్రాంజ్, 1973లో సిల్వర్ గెలిచింది.
భారత హాకీ టీమ్:
డిఫెండర్లు: జర్మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్(కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్దీప్ సివాచ్,
మిడ్‌ఫీల్డర్లు: రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లాలాగే, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, నీలకంఠ శర్మ, వివేక్ సాగర్ ప్రసాద్.
ఫార్వర్డ్లు: దిల్‌ప్రీత్ సింగ్, శిలానంద్ లక్రా, సుఖ్జీత్ సింగ్, మన్దీప్ సింగ్, అభిషేక్.
గోల్ కీపర్లు: మోహిత్ హెచ్ఎస్, సూరజ్ కర్కెరా.
కథనం మొదట ప్రచురించబడింది: మంగళవారం, జూలై 21, 2026, 17:29 (IST)
ఇతర కథనాలు ప్రచురించబడ్డాయి జూలై 21, 2026

