- హార్ముజ్‌పై అమెరికా-ఇరాన్ గుడ్‌న్యూస్
- తీరనున్న చమురు కష్టాలు!
- ఒప్పందంపై ఇరాన్ మీడియాలో కథనాలు
పశ్చిమాసియాలో నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు చక్కగా కనిపిస్తున్నాయి. కొన్ని గంటల ముందు రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ.. తాజా పరిణామాలు చూస్తుంటే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొలిక్కి వస్తున్నాయి. ప్రధానంగా హార్ముజ్ జలసంధిపై నెలకొన్న సందిగ్ధం వీడబోతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రాథమిక ముసాయిదా ప్రకటించారు.. త్వరలోనే హార్ముజ్ జలసంధి నుంచి వాణిజ్య రవాణా నౌకలు యధావికంగా ప్రయాణాలు జరగొచ్చని సూచిస్తున్నాయి.
హార్ముజ్‌పై నావికా దిగ్బంధాన్ని ఎత్తివేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లుగా ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రదర్శించింది. రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం జరిగినట్లుగా ఉంది. ఒప్పందంలో భాగంగా ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమెరికా సైనిక బలగాలు ఉపసంహరణ, నావికా దిగ్బంధనాన్ని వేయడం వంటి అంశాలను ప్రదర్శించారు. దిగ్బంధం ఎత్తేస్తే.. హార్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ హామీ ఇచ్చిందని.
ఇక అమెరికాతో ఉన్న సంఘర్షణను ముగించేందుకు కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ప్రాథమిక అనధికారిక ముసాయిదా ప్రతిని టెహ్రాన్ అని ఇరాన్ ప్రభుత్వ టీవీ నివేదించింది. ఈ ముసాయిదా ప్రకారం.. ఇరాన్ ఒక నెలలోపు హోర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరిస్తుంది. అదే సమయంలో అమెరికా.. ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి తన సైనిక బలగాలను ఉపసంహరించుకుని.. నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది.
ఇక యుద్ధ నౌకల మోహరింపులో మార్పులు ముసాయిదాలో చేర్చినట్లు సమాచారం. ఇంకా ఒమన్‌తో కలిసి హార్ముజ్ జలసంధిలో నౌక రవాణాను నిర్వహించడంపై ఇంకా ధృవీకరణ రాలేదు. పక్కా ధృవీకరణ లేకుండా టెహ్రాన్ ఎలాంటి చర్య తీసుకోదని కూడా ఈ ముసాయిదాలో ప్రదర్శించారు.

