క్రిస్టోఫర్ నోలన్: స్క్రీన్ మీద కనిపించి అలరించే హీరోల కంటే అద్భుతాలను క్రియేట్ చేయగలిగేలా దర్శకులకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఒక సినిమా ఎలా చేస్తే ప్రేక్షకుడిగా నచ్చుతుంది. ఒక సినిమాని విజువల్ గా ఎంత గ్రాండియర్ గా చూపించొచ్చు. ఆ సినిమా ద్వారా ప్రేక్షకుడికి మనం ఏం చెప్పాలి అనే విషయాల గురించి దర్శకుడు వర్క్ లోనే క్షుణ్ణంగా రాసుకుంటాడు. వానినింటితో ప్రయోగాత్మకమైన సినిమా చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునేలా తీర్చిదిద్దాగలిగిన వాళ్లను మాత్రమే దిగ్గజ దర్శకులు అంటారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో క్రిస్టోఫర్ నోలాన్ ఈ మాటకు సరిగ్గా సరిపోతాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా డిఫరెంట్ గానే ఉంటుంది. సినిమాని చూస్తే ప్రేక్షకుడు కొత్త అనుభూతిని పొందుతాడు. సినిమా మేకర్స్ అయితే ఆయన నుంచి చాలా వరకు ఇన్ పుట్స్ ను తీసుకొని వాళ్ళ సినిమాల్లో ఉంటారు. నిజానికి క్రిస్టోఫర్ నోలన్ ఎన్ని సినిమాలు చేశాడు ఆయనకి ఎందుకంత క్రేజ్ ఉంది. ఆయన సినిమాల్లో ఏముంటుంది అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం…
క్రిస్టాఫర్ నోలన్ మొదట ‘ఫాలోయింగ్’ అనే ఒక మూవీ… ఎలాగైనా సరే దర్శకుడిగా మారాలనే కసితో ఆయన తీసిన ఈ మూవీ 6 వేల డాలర్లతో తెరకెక్కిస్తే 1.26 లక్షల డాలర్లను వసూలు చేసింది…నిజానికి తన మొదటి సినిమా ఎలా చేయాలి అనే విషయంలో సరైన క్లారిటీ లేదు. కానీ తన దగ్గర ఉన్న మెటీరియల్ ను వాడుకొని తన స్నేహితులను ఆర్టిస్టులు గా తీసుకొని ఆయన చేసిన ప్రయోగం సక్సెస్ అయింది… పెట్టిన బడ్జెట్ కంటే 21 రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ను…
మెమెంటో (2000)
ఒక వ్యక్తి కి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటే ఆయన ఎలాంటి ఇబ్బందులు పడతాడు. తన భార్యను చంపిన వాళ్ల మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా కథ… నిజానికి నోలన్ కి ఇది రెండో సినిమా అయినప్పటికి తను చెప్పిన స్టోరీ టెల్లింగ్ విధానం… సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాల్లోనే ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ గా…ఈ మూవీకి 9 మిలియన్ బడ్జెట్ పెడితే 43.26 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వచ్చాయి. పెట్టిన బడ్జెట్ కంటే 5 రెట్లు ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది…
ఇన్సోమియా (2002)
నోలన్ వచ్చిన డైరెక్టర్ అవ్వకముందు నార్వే లో సోమియా సినిమా అదే పేరుతో హాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు…
బ్యాట్ మ్యాన్ బిగిన్స్ (2005)
హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ మ్యాన్ హీరోల సినిమాలకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది. 1997లో వచ్చిన ‘బ్యాడ్ మ్యాన్ అండ్ రాబిన్’ తర్వాత ఆ పాత్ర కనుమరుగైపోయింది. దాంతో బ్యాడ్ మ్యాన్ సిరీస్ మూవీస్ ముగిసినట్టే అని అభిమానులు భావించారు.కానీ నోలన్ తీసిన ‘బ్యాడ్ మ్యాన్ బిగిన్స్’తో సరికొత్త సినిమాకి శ్రీకారం చుట్టారు. అలాగే డార్క్ నైట్ ట్రైలాజీ ద్వారా ఆ సూపర్ హీరో కి ప్రాణం పోశారు…
ప్రెస్టీజీ (2006)
చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి సూపర్ హిట్ ను అందుకున్నారు. ఇద్దరు మెజిషియన్స్ మధ్య జరిగే పోటీలో ఎవరు పై చేయి సాధించారు. ఎవరు టాప్ లో నిలిచారు అనే పాయింట్ ను విజువల్ గా స్క్రీన్ మీద చాలా బాగా ప్రజెంట్ చేశారు…
డి డార్క్ నైట్ (2008)
ట్రైలాజీ లో వచ్చిన రెండో సినిమా ఇది… నోలన్ కెరియర్ లోనే అత్యధిక బిలియన్ డాలర్లు సాధించిన తొలి సినిమా…185 మిలియన్ డాలర్ల బడ్జెట్ పెడితే 1.008 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను వసూలు చేసింది…
ఇన్సెప్షన్ (2010)
ఈ మూవీ నోలన్ యొక్క పూర్తి టాలెంట్ ను బయట పెట్టిన సినిమా… నిజానికి ఈ మూవీ ఒక్కసారి చూస్తే అసలు అర్థం కాదు… ప్రేక్షకుల ఐక్యూ లెవల్ ను టెస్ట్ చేసే సినిమా ఇది…
ది డార్క్ నైట్ రైజెస్ (2012)
నోలన్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన మూవీగా ఈ సినిమా నిలవడం నిజంగా చాలా గొప్ప విషయం…
250 మిలియన్ డాలర్ల బడ్జెట్తో విడుదలైన ఈ మూవీ 1.085 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను వసూలు చేసింది… ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ హీరో సినిమాల్లో డార్క్ నైట్ ట్రైలాజీ స్థానం సంపాదించుకుంది…
ఇంటర్ స్టెల్లార్ (2014)
వినూత్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సైన్స్ కి సంబంధించిన చాలా విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా ఫిజిక్స్ మీద బేసిక్ నాలెడ్జ్ లేనివాళ్ళకి ఈ సినిమా అర్థంకాదు…
డాంకిర్క్ (2017)
రెండోవ ప్రపంచయుద్ధ సమయంలో డాంకిర్క్లో చిక్కుకుపోయిన లక్ష మందికి పైన ఉన్న సైనికులను రెస్క్యూ టీం ఎలా కాపాడింది. జల మార్గం, వాయు మార్గం, భూమార్గం ద్వారా వాళ్ళను ఎలా సేవ్ చేశారనేది ఈ మూవీలో చూపించారు…
టెనెట్ (2020)
రోగ నిర్ధారణ సమయంలో విడుదల అయిన ఈ మూవీని ప్రేక్షకులు చూడరని అందరు అనుకున్నారు. కానీ ఈ మూవీకి కూడా మంచి ఆదరణ దక్కింది…
ఇక మొత్తానికైతే ఇప్పుడు మరోసారి ఒడిస్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు… తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఎలాంటి దర్శకుడో హాలీవుడ్ లో క్రిస్టోఫర్ నోలన్ సైతం అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు…

