హీరో అఖిల్ రాజ్ కు డెలివరీ బాయ్ తో జరిగిన గొడవ వివాదంగా మారింది. మంగళవారం (జూన్ 30) సాయంత్రం కొందరు దుండగులు అఖిల్ రాజ్ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. దీంతో తనపై దాడి జరిగింది అఖిల్ రాజ్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. కొండాపూర్ లో కొందరు తన కారును అడ్డగించి దాడికి యత్నించారని ఫిర్యాదు చేశారు. అఖిల్ రాజ్ కారుపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
►ఇంకా చదవండి | పిల్లలను చంపేస్తామంటూ చిన్మయి ఫ్యామిలీకి బెదిరింపులు.. సోషల్ మీడియాకు రాహుల్ రవీంద్రన్ గుడ్ బై!
నిన్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్ ఓ డెలివరీ బాయ్ పై దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హీరో అఖిల్ రాజ్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయగా, డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో, డెలివరీ బాయ్‌పై ఇలా దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇరువర్గాల వాదనలను విచారిస్తున్నారు.
హీరో #అఖిల్ రాజ్ కారు పై దాడి చేస్తున్న దుండగుల వీడియో pic.twitter.com/FL5IO1Ri27
— సినీజోష్ (@cinejosh) జూన్ 30, 2026

