ముంబయి: ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, సరికొత్త ‘ప్యాజి డిస్క్క’ను మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు ప్రకటించింది. రోజువారీ ప్రయాణికులకు ఆధునిక మొబిలిటీ పరిష్కారాలను అందించడానికి బ్రాండ్ నిబద్ధతను ఈ సెట్లిష్, ఫీచర్`రిచ్ కొత్త వేరియంట్ మరింత బలపరుస్తుంది. పట్టణాల్లో రోజువారీ ప్రయాణాలకు, ఆచరణాత్మక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ మోటార్‌సైకిల్.. అత్యుత్తమ పనితీరు, ఇంధన సామర్థ్యం, సౌకర్యాల మేలు కలయికతో నేటితరం రైడర్లకు అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఈ లాంచ్ సందర్భంగా హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ యమూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ వర్మ మాట్లాడుతూ.. “సరికొత్త ప్యాషన్ ప్లస్ డిస్క్ విడుదల.. భారతదేశంలో అత్యంత నమ్మకమైన, ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్లలో ఒకటిగా ఉన్న ‘ప్యాషన్’ వారసత్వాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. వేరియంట్ బ్రాండ్ ఆకర్షణను మరింత పెంచడంతో పాటు, ఈ హీరో మోటోకార్ప్ నాయకత్వ రూపకల్పన మరింత పటిష్టం చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు. సరికొత్త ప్యాషన్జి డిస్క్క ఒక సరికొత్త వ్యక్తిత్వంతో, సమకాలీన డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తుంది. ప్యాషన్ సిరీస్‌కు ఉన్న ఐకానిక్ లక్షణాలను కోల్పోకుండానే.. నేటి పట్టణ ప్రయాణికులు పెరుగుతున్న ఆకాంక్షలకు అద్దం పట్టేలా తీర్చిదిద్దారు.

