తెలంగాణ:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్(హుజూర్నగర్) పట్టణంలోని పలు ప్రాంతాల్లో రైస్ మిల్లుల నుండి వెలువడుతున్న బూడిద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ,మల్లన్న నగర్,సీతారామ నగర్,టీచర్స్ కాలనీ,ఉత్తమ పద్మావతి నగర్, అడ్డరోడ్డు ప్రాంతాల ప్రభావం ఎక్కువగా ఉందని బూడిద కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
మిల్లులు కాలుష్య పరికరాలు సక్రమంగా వినియోగించాలని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

