– ప్రకటన –
నవతెలంగాణ-మోపాల్
మోపాల్ మండలం హున్య నాయక్ తండాలో ఉపాద్యాయుడు ప్రేమ్ లాల్ బడి బాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 5 మంది పిల్లలను బడి బయట పిల్లలుగా గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్రిమినల్ మాట్లాడుతూ గ్రామంలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చుకోవాలని, అనవసరంగా డబ్బులనే వృధా చేసుకోకుండా మన గ్రామంలోనే పాఠశాల విద్యాభ్యాసం కార్పోరేట్ పాఠశాలకు ఏ రకంగానూ తీసిపోదని ఆయన గ్రామంలోని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పెద్దలు తల్లి దండ్రులు ఉన్నారు.
– ప్రకటన –

