వాషింగ్టన్ :అమెరికాలో పనిచేయాలనుకున్న విదేశీ నిపుణులు , వారిని నియమించుకునే టెక్ కంపెనీలకు భారీ ఊరట లభించింది. కొత్తగా జారీ చేసే హెచ్1బీ వీసాలపై 100,000 డాలర్లు (సుమారు రూ. 96 లక్షలు) భారీ ఫీజును వసూలు చేయాలన్నా ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ రుసుము వసూలును నిలిపివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ట్రంప్ దాఖలు చేసిన అప్పీల్‌ను శుక్రవారం కోర్టు తిరస్కరించింది. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కోసం జారీ చేసే హెచ్1బి వీసాలపై లక్ష అదనపు రుసుమును విధిస్తూ గత ఏడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ 20 మంది డెమొక్రటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన దిగువ కోర్టు, అమెరికా కాంగ్రెస్ అధికారం ఎలాంటి ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఫీజును విధించిందని, ఇది చట్టవిరుద్ధమైన పన్ను కిందకు వస్తుందని జూన్ 8న ఫీజు వసూలుపై స్టే విధించింది.
ఈ తీర్పును నిలిపివేయాలని ట్రంప్ పని బోస్టన్గా పనిచేసే ఫస్ట్ సర్కూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో పిటిషన్ దాఖలు చేయబడింది. పరీక్ష విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం , ఈ ఫీజును విధించే అధికారం ఉందని నిరూపించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేసింది. దిగువ కోర్టు తీర్పును సమర్ధిస్తూ ప్రభుత్వ అప్పీలును తోసిపుచ్చి ంది. అమెరికన్ల ఉద్యోగాల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను ని యమించుకోవడానికి హెచ్1 బీఈ దుర్వినియోగం నిలిపివేసేందుకు ఈ ఫీజు విధించామని ట్రంప్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. సాధారణంగా వివిధ వస్తువులను బట్టి హెచ్1బీ వీసా రుసుము 2000 నుండి 500 డాలర్ల వరకు ఉంటుంది. ఏకంగా లక్ష వ్యక్తులకు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

