విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఉన్నట్లు తిప్పేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి జరగడంతో రక్త గాయాలతో లాయర్ ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ప్రాథమిక వైద్య చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. వివరాలకు వెళితే.. న్యాయవాది అంజన్ రెడ్డి మాట్లాడుతూ విధుల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్తో మాట్లాడుతుండగా మంత్రి అనుచర వర్గం ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగడంపై హైకోర్టు న్యాయవాది బాధను వ్యక్తం చేశారు. తనపై మంత్రి సత్య కుమార్ పీఏ హరీష్ బాబు తో పాటు అనుచరులు దాడి చేయడం జరిగింది. తలపై పిడుగు గుద్దుతూ తీవ్రంగా దాడి చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్మవరం పట్టణంలో సంచలనం రేపింది. మంత్రి సత్య కుమార్ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గాను నాపై కక్ష కట్టి దాడి చేయడం జరిగిందని న్యాయవాది స్పష్టం చేశారు. మంత్రి తనను పిఏ హరీష్ బాబు తో పాటు ప్రణీవ్ యాదవ్ తో పాటు మరో ఆరు మంది మామూలుగా పిలిచి దాడి చేయడం జరిగింది. మా పైనే ఫేస్ బుక్ లో ఇతరులలో రాస్తావా అంటూ నీవు బతకలేవు చంపుతాం అని బెదిరించడం జరిగింది తను ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫోను కూడా లాకెళ్లడం గుర్తించారు. నాపై దాడి జరిగిన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తదుపరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

