మన తెలంగాణ/నాచారం: ఎస్ఐఆర్, ఐఐసిటీ నియామక పరీక్షల మాల్ ప్రాక్టీస్ రాకెట్‌ను నాచారం పోలీసులు బట్టబయలు చేశారు. ఈ పరీక్ష నాచారంలోని సెయింట్ పాయిస్ మహిళ ల పాఠశాలలో జరిగింది. 8 మల్టీ టాస్కిం గ్ స్టాఫ్ పోస్టుల భర్త్తీ కోసం నిర్వహించిన పరీక్షలో సుమారు 800మంది రాయడానికి ముందుంది. పరీక్షకు హాజరైనవారిలో హర్యానాకు సంబంధించిన 12 మంది యువకులు మాస్ కాలింగ్‌కు హాజరైన విషయం బయటపడింది. మాస్ కాపీయింగ్ విషయంలో 12 మంది యువకులు తమ చెవ్వుల్లో మైక్రో స్పై ఇయర్ ఫోన్లు, జీఎస్ఎం కమ్యూనికేషన్ పరికరాలు, మార్పు చేసిన మొబైల్ ఫోన్లు, రహస్య ఎలక్ట్రానికి గాడ్జెట్లను ఉపయోగించి వాటి సిగ్నల్స్ ద్వారా బయట ఉన్నవారి నుంచి పరీక్షా పత్రాల జవాబులను తెలుసుకొని అక్రమమార్గంలో పరీక్షలు రాస్తున్న స్కాడ్ ద్వారా పోలీసులు పసిగట్టారు.
హర్యానాకు చెందిన రామ్ కేష్, అజయ్, మందీప్, సాహిల్, నితీష్, అజ్మీర్, ధీరాజ్, అజయ్, స్వాభిమాన్, మనోజ్, పంకజ్, మోనుకుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రహస్య పరికరాలను తమ లోదుస్తుల్లో దాచిపెట్టి, మరికొందరు కాలి షూస్‌లలో దాచిపెట్టుకొని పరీక్ష హల్లోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. నాచారం స్పెక్టర్ కె.ధనుంజయ దర్యాప్తు దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుంచి దళం రూ.1 లక్ష నుంచి 8 లక్షల వరకు డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్‌కు అవసరమైన పరికరాలు వారికి అందించినట్లు స్పష్టమైంది. ఈ కేసును ఉప్పల్ డీసీపీ విచారణ చేపట్టి, నాచారం పోలీసుల సమక్షంలో కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న రామ్మోహర్, రమణ, రాహుల్ రామన్, జస్మత్, అనేవారిని పట్టుకోవడానికి తమ సిబ్బంది ఢిల్లీకి బయల్దేరినట్లు తెలిపారు.

