హైదరాబాద్: హైదరాబాద్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. పేరు గాంచిన ప్రముఖ హోటళ్లలో శుభ్రత లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. కొండాపూర్‌లోని పాలమూరు గ్రిల్, హైటెక్ సిటీలోని మెహెఫిల్ రెస్టారెంట్, రాయదుర్గంలోని షా గౌస్, గచ్చిబౌలిలోని నవాబ్ రెస్టారెంట్, ఖాజాగూడ ఇగురు రెస్టారెంట్, రామేశ్వరం కేఫ్‌లలో లోపాలు బయటపడ్డాయి.
ఈ రెస్టారెంట్లలో కిచెన్లు.. మరీ ముఖ్యంగా హైటెక్ సిటీలోని మెహెఫిల్ రెస్టారెంట్లో కిచెన్లు ఎంత డర్టీగా ఉన్నాయాంటే చూస్తేనే వాంతొచ్చేలా ఉన్నాయి. అంత అధ్వానంగా, అపరిశుభ్రంగా కిచెన్లు ఉండటం చూసి అధికారులు విస్తుపోయారు. ఎక్స్పైరీ అయిన, నిల్వ ఉంచిన పాత ఆహార పదార్థాలను వంటల్లో వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. కిచెన్ సీలింగ్‌లు, గోడలు, లైట్లపై గ్రీజు, దుమ్ము పేరుకుపోయినట్లు పేర్కొన్నారు.
🍽️ ఆహార భద్రత తనిఖీ డ్రైవ్
రెస్టారెంట్: M/s మెహ్ఫిల్ రెస్టారెంట్
📍 హైటెక్ సిటీ
📅 27.06.2026సైబరాబాద్ వ్యాప్తంగా సాధారణ ఆహార భద్రత తనిఖీల్లో భాగంగా, సీఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందాలు మెహఫిల్ రెస్టారెంట్‌ను తనిఖీ చేశాయి.
✅ మంచి పద్ధతులు
• హెయిర్నెట్లను ఉపయోగించే ఫుడ్ హ్యాండ్లర్లు
• వెజ్ & నాన్ వెజ్… pic.twitter.com/58Mg47KQbd— సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (@CMC_Offcl) జూన్ 27, 2026
కిచెన్ ప్రాంతంలోనే ఓపెన్ డ్రైన్లు, ఆహార వ్యర్థాలు పేరుకుపోయినట్లు పేర్కొన్నారు. పలు రెస్టారెంట్ల కిచెన్లలో ఈగలు, ఎలుకలు, బల్లులు సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు హానికరమైన ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు పలు తనిఖీల్లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కిచెన్ సిబ్బంది గుట్కా నములుతూ వంటలు చేస్తున్న ఘటనలపై అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితం వండిన ఆహారాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేసి మళ్లీ కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పలు రెస్టారెంట్లలో బయటపడింది. గడువు ముగిసిన ఫుడ్ ప్రొడక్ట్స్, లేబుళ్లు లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని అధికారులు ధ్వంసం చేశారు. తనిఖీల్లో లోపాలు బయటపడ్డ రెస్టారెంట్లకు అధికారులు కేవలం నోటీసులిచ్చి వదిలేస్తే అద్భుతమైన రెస్టారెంట్ల నిర్వాహకులు తిరిగి మళ్లీ కంటిన్యూ చేస్తుండటం గమనార్హం.

