నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ‘హైడ్రా’పై గత కొన్ని రోజులుగా వ్యతిరేక ప్రచారం జరుగుతోందంటూ ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన హైడ్రా యాక్షన్ ప్లాన్, ఇప్పటివరకు సాధించిన విజయాలపై పక్కా లెక్కలతో క్లారిటీ ఇచ్చారు.
హైడ్రా కేవలం కూల్చివేతలకే పరిమితం కాలేదు, ఇప్పటివరకు సిటీలో దాదాపు 600 ఆపరేషన్లు పూర్తయ్యాయి, ఆక్రమణదారుల గుప్పిట్లో ఉన్న సుమారు లక్షా పదివేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, చెరువులను, పార్కులను కాపాడామని రంగనాథ్. దోపిడీకి గురికాకుండా ఉండాలనే ఆకాంక్షతోనే ప్రత్యేక తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలు కొట్లాడారని, ఆ ఆశయాలకు అనుగుణంగానే ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తున్నామని చెప్పారు.
“రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఎంఐఎం, అధికార కాంగ్రెస్ అయినా మాకు ఒకటే. ఫాతిమా కాలేజీ లాంటి విద్యాసంస్థలు భాగ్యనగరంలో చాలా ఉన్నాయి. చట్టం అందరికీ సమానమే. హైడ్రా ఎప్పుడూ సైలెంట్‌గా ఉండదు. అలాగని రాత్రికి రాత్రికి వచ్చి ఇళ్లను కూల్చేస్తుందనేది అవసరం” అని స్పష్టం చేశారు.
పోస్ట్ హైడ్రాపై దుష్ప్రచారం ఆపండి: కమీషనర్ రంగనాథ్ మొదట కనిపించింది నవతెలంగాణ.

