– ప్రకటన –
2036 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటమే లక్ష్యం
గాంధీ స్ఫూర్తితోంగ్ ఇండియా పేరుతో విశ్వవిద్యాలయం
స్పోర్ట్స్ యూనివర్శిటీ లోగో ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్ : 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఒలింపిక్స్నిర్వహించటం నా కల. అందుకే హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌తో పాటు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్శిటీ లోగోలు, నమూనాలను భారత ఒలింపిక్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి. ఉషతో కలిసి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘గత 10 ఏండ్లుగా తెలంగాణకు క్రీడా విధానం లేదు. ఓ పాలసీ లేకుండా ప్రభుత్వం, అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అందుకే, మా ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలో స్పోర్ట్స్ పాలసీ రూపొందించాం. 20 ఏండ్ల కిందటే ఆఫ్రో ఏసియా, ప్రపంచ మిలటరీ గేమ్స్‌కు ఆతిథ్యం అందించిన చరిత్ర హైదరాబాద్‌కు ఉంది. కానీ గత ప్రభుత్వ హయాంలో స్టేడియాలను పెండ్లిలకు, విందులకు ఇతర వేడుకలకు అద్దెకు ఇవ్వటం దురదృష్టకరం. స్వేచ్ఛ కోసం పోరాడేందుకు మహాత్మ గాంధీ యంగ్ ఇండియా పత్రికను నడిపారు. ఆ స్ఫూర్తితోనే క్రీడా విశ్వవిద్యాలయానికి యంగ్ ఇండియా పేరు పెట్టాం.
క్రీడల్లో రాణించడానికి పాలసీలు, శిక్షణ, అకాడమీలు, విశ్వవిద్యాలయం అవసరం. 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అప్పుడు హైదరాబాద్‌లో ఒలింపిక్స్నిర్వహించటం నా కల. 2036 ఒలింపిక్స్‌లో పతకాల అథ్లెట్లను తయారు చేసేందుకు తెలంగాణ చిత్తశుద్దితో పని చేస్తోంది. క్రీడల్లో రణించిన నిఖత్ జరీన్, ఇషా సింగ్, మహ్మద్ సిరాజ్, దీప్తి జీవాంజిలకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం. క్రీడలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించింది. 2028లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను’ అని అన్నారు. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు.
భారత్‌లో, తెలంగాణలో బలమైన స్పోర్ట్స్ కల్చర్‌కు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు అతిపెద్ద అడుగు అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష అన్నారు. ‘ఓ అథ్లెట్‌గా చెబుతున్నాను.. మనకు మంచి క్రీడాకారులతో పాటు మంచి కోచ్‌లు, స్పోర్ట్స్ సైన్స్, స్సార్ట్స్ మెడిసిన్ ఎంతో అవసరం. ఫిజికల్ ఎడ్యుకేషన్, పారా స్పోర్ట్స్‌పై దృష్టి నిలుపుతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. ఈ యూనివర్శిటీ నుంచి కోచ్‌లు, రిఫరీలు, అడ్మినిస్ట్రేటర్లు తయారు కావాలి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ ఫెలోషిప్ ’ప్రవేశపెట్టడం అభినందనీయమని’ పిటి ఉష తెలిపారు.
నగదు ప్రోత్సాహకాలు అందజేత
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన తెలంగాణ క్రీడాకారులకు ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నగదు ప్రోత్సాహకాలు ప్రకటించారు. పారా అథ్లెట్, పారిస్ పారాలింపిక్స్ మెడలిస్ట్ దీప్తి జీవాంజికి రూ.50 లక్షలు, షూటర్ ఇషా సింగ్‌కు రూ.3.30 కోట్లు, పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు రూ.2.10 కోట్లు, బాక్సర్‌కు తనిఖత్ రూ.60 కోట్లు, రూ.60 కోట్లు రూ.53 లక్షలు, సురభి భరద్వాజ్‌కు రూ.10 లక్షల చెక్కులు అందించారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్శిటీ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయశ్ రంజన్‌తో పలు కంపెనీల ప్రతినిధులు కుదుర్చుకున్నారు. పారా అథ్లెట్ల ప్రతిభాన్వేషణకు ఆదిత్య మెహతా ఫౌండేషన్‌తో ఎంవోయూ పత్రాలు మార్చుకున్నారు.
– ప్రకటన –

