దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఃకాక్రోచ్ జనతా పార్టీ హైదరాబాద్‌లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ధర్నా చౌక్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నిర్వహించారు. అలాగే పెద్ద సంఖ్యలో యువత కూడా ఈ నిరసనలో భాగమైంది. ఈ సందర్భంగా నిరసనకారులు నీట్ లీకేజీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు అన్యాయం జరిగింది
ఆకునూరి మురళి మాట్లాడుతూ దేశంలో సంపద పంపిణీ, నిరుద్యోగ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఃఃదేశంలో ఎంతో సంపద ఉంది. అది ఎక్కడికి వెళ్తోంది? నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది? యువతనుఃకాక్రోచ్లుగాః గుర్తించడం ఏంటి? దేశంలో కేవలం ఆరు శాతం యువతకే నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి మిగతావారికి ఆ నైపుణ్యాలు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. అలాగే విద్యార్థులకు అన్యాయం జరిగింది ఆరోపిస్తూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయవలసి ఉంది, అవసరమైతే ఆయనను జైలుకు పంపాలని కూడా ఆకునూరి మురళి డిమాండ్ చేశారు.
పోస్ట్ హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. ధర్నా చౌక్‌లో ఉద్రిక్తత! మొదట కనిపించింది విశాలాంధ్ర.

