తెలంగాణ:హైదరాబాద్ నగరంలో “కాక్రోచ్ జనతా పార్టీ” ( బొద్దింక జనతా పార్టీ )పేరుతో కొందరు యువత చేపట్టిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది.పెరుగుతున్న పెట్రోల్ ధరలు,యువత సమస్యలు,కేంద్ర ప్రభుత్వ విధానాలపై వ్యంగ్యాత్మకంగా నిరసన తెలుపుతూ పలు పెట్రోల్ బంకుల వద్ద మెలోడి చాక్లెట్లు పంచారు.
ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ… “ప్రధాని మోదీ ( ప్రధాని మోదీ )జీ ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడి చాక్లెట్లు ఇవ్వడం ప్రపంచ వార్త అయింది.అందుకే మేమూ ప్రజలకు మెలోడి చాక్లెట్లు పంచుతున్నాం” అంటూ వ్యంగ్యంగా నిలిచారు.
“పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ధరలు చూసి ప్రజల నోరు చేదుగా మారుతోంది.కనీసం చాక్లెట్‌తో అయినా నోరు తీపిగా ఉండాలి కదా” అంటూ సెటైర్లు వేశారు.
యువత చేతుల్లో “కాక్రోచ్ జనతా పార్టీ,యూత్‌కు ఉద్యోగాలు కావాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి” వంటి ప్లకార్డులు కనిపించాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “కాక్రోచ్ జనతా పార్టీ” పేరును ప్రతీకాత్మకంగా ఉపయోగిస్తూ, యువత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ వినూత్న నిరసన అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షించింది,కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వైరల్‌గా మారింది.

