హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉంది. సిటీ పరిధిలోని ఆర్సీపురం, పటాన్ చెరు, చందానగర్, శేరిలింగంపల్లితోపాటు పలు ప్రాంతాల్లో మరో గంటలో వర్షం కురిసే అవకాశం ఉంది. గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, మణికొండ, ఖాజాగూడ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
మియాపూర్, కుకట్ పల్లి పరిసర ప్రాంతాల ఉరుములు, మెరుపులతో వర్షం పడొచ్చని, రాత్రి 9గంటల నుంచి 11 మధ్య సిటీలో దక్షిణ ప్రాంతాలలో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఉంది.
►ఇంకా చదవండి | హైకోర్టు తీర్పుతో యాక్షన్లోకి హైడ్రా.. సైబర్ టవర్స్ పక్కనే 3 వేల కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్
నిన్న కురిసిన వర్షానికి సిటీలో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ లతో సిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు .ఈ బుధవారం రాత్రి కూడా వర్షాలు కురిస్తాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

