హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందుతోంది.. ఐటీ, ఫార్మా, ఆర్థిక సేవలు, పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీల అభివృద్ధితో నగరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా ఉపాధి పొందిన దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్గా ఎదిగింది. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరంలో నివసించేందుకు ఉపాధి కోసం వస్తున్నారు. అయితే మహిళల ఉపాధి, జీతం విషయంలో పురుషులతో సగానికి కంటే తక్కువ. ఈ నిర్వహణ స్వయంగా ఉన్నట్లు,కార్యక్రమఅమలు మంత్రిత్వ శాఖ (MoSPI) తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
రిపోర్టు ప్రకారం, హైదరాబాద్లో పురుషుల మ్యాన్ పవర్ భాగస్వామ్య రేటు 77.6 శాతం ఉండగా, మహిళలది కేవలం 32.5 శాతం మాత్రమే. అంటే పని చేసే వయస్సులో ఉన్న ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు.
అయితే, ఉద్యోగంలోకి వచ్చిన మహిళలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పనిచేస్తున్న మహిళల్లో దాదాపు 59.3 శాతం మంది మంచి జీతాలు పొందే ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది మహిళలకు స్థిరమైన ఉద్యోగాలు లభిస్తున్నాయని సూచిస్తోంది.
అయినా మహిళలు, పురుషుల ఆదాయంలో మాత్రం పెద్ద తేడా కనిపించింది. స్వయం ఉపాధి పొందుతున్న మహిళల సగటు నెలసరి ఆదాయం రూ.15వేల 558 మాత్రమే పొందుతుండగా.. అదే పురుషుల సగటు ఆదాయం రూ.33వేల 420గా ఉంది. అంటే మహిళల ఆదాయంతో సగటు సగం కంటే తక్కువ. వ్యాపార, పెట్టుబడులు, ఆదాయ వనరుల్లో మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారని ఇది స్పష్టం చేస్తోంది.
►ఇంకా చదవండి | 12వేల కి.మీ తిరగ్గానే కొత్త ఇన్నోవా బ్రేక్ డౌన్.. ఈ20పై గడ్కరీని పొట్టుపొట్టు తిట్టిన ఓనర్
మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాల్లో చేరితే కుటుంబ ఆదాయం పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా మరింత వేగంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, సురక్షితమైన పని వాతావరణం, అనుకూల విధానాలు కల్పించడం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు.
మొత్తంగా హైదరాబాద్ ఉపాధి అవకాశాల పరంగా ముందంజలో ఉండటం, మహిళల మ్యాన్ పవర్ భాగస్వామ్యాన్ని ఇప్పుడు అత్యంత ముఖ్యమైనదిగా మారింది. ఈ లింగం అంతరాన్ని తగ్గించగలిగితే హైదరాబాద్ మరింత మెరుగైన, బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

