హైదరాబాద్ సిటీని సక్కగా చేయకుండా.. ఉన్న హైదరాబాద్ ను బాగు చేయకుండా ప్యూచర్ సిటీ కడతాం అంటే ఎవరూ నమ్మటం లేదు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్. హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాల్సింది ఇంకా చాలా ఉందని.. దాన్ని వదిలేసి కొత్త సిటీ సిటీ కట్టాల్సిన అసవరం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. మీడియా చిట్ చాట్ లో ప్యూచర్ సిటీకి సంబంధించిన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారాయన.
సీఎం రేవంత్ రెడ్డికే ప్యూచర్ లేదని.. ఇంక ప్యూచర్ సిటీ ఏంటని నిలదీసిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి విధానాలతో తెలంగాణ రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిందంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరుధ్యం లేదని.. రాజకీయంగానే అభిప్రాయ బేధాలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు.
ఇంకా చదవండి:కేసీఆర్ బస్సు యాత్ర.. కేటీఆర్ పాదయాత్ర
మొన్నటి వర్షానికి హైదరాబాద్ సిటీలో వాహనదారుల అవస్థలు చూశామని.. దీనికి కారణం రేవంత్ రెడ్డి నిర్ణయాలే అని.. సీఎంగా హైదరాబాద్ సిటీపై అవగాహన లేదంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. ఉన్న సిటీని పట్టించుకోకుండా ప్యూచర్ సిటీపై ఫోకస్ పెట్టి జనాన్ని ఇబ్బందులకు గురిచేయడం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. రెండు చెరువులు బాగు చేసి ఫోజులు కొడుతున్నారు.. బీఆర్ఎస్ హయాంలో 100 చెరువుల అభివృద్ధి చేసిన విషయం కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అన్నింటికి హైడ్రా అంటూ జిందా తిలిస్మాత్ మాదిరి వాడాలని.. దీని వల్లే మొన్నటి వర్షాలకు వచ్చిన దుస్థితి అంటూ చురకలు అంటించారు కేటీఆర్.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “హైదరాబాద్ సక్కగా చేయండి.. ప్యూచర్ సిటీని ఎవరూ నమ్మటం లేదు : కేటీఆర్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

