2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ఐదు పెద్ద అప్డేట్లు: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన హోండా సిటీ సెడాన్ కారు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో లాంచ్ అయింది. దీని ప్రారంభ ధర రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ అనౌన్స్ చేసింది. మిడ్‌సైజ్ సెడాన్ సెగ్మెంట్లో తన మార్కెట్‌ను కాపాడుకోవడానికి హోండా ఈ కారులో ఐదు ముఖ్యమైన మార్పులు చేసింది. మునుపటి మోడల్ తో ఈ కొత్త వెర్షన్ మరింత మోడల్ లుక్, హైటెక్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేలా సిద్ధమైంది. ఈ లేటెస్ట్ అప్డేట్లో కారు ఎక్స్టీరియర్ స్టైలింగ్ సేఫ్టీ వరకు చాలా విషయాలు అప్డేట్ చేయబడ్డాయి.
ఇది కూడా చదవండి: AC ఆన్‌లో ఉన్నా పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవచ్చు.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవి పాటించండి
కొత్త ఎక్స్టీరియర్ స్టైలింగ్..
కొత్త 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లో లుక్పరంగా మెరుగైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారు ఫ్రంట్ ప్రొఫైల్‌లో బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో కనెక్ట్ అయిన ఎల్ఈడీ డీఆర్ఎల్ (DRL) లైట్ బార్‌ను అమర్చారు. బ్లాక్ మ్యాట్రిక్స్ మెష్ గ్రిల్, రీపోజిషన్ చేసిన హోండా లోగో కారుకు స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. కారు పొడవును 11 మిమీ పెంచడంతో ఇప్పుడు ఇది 4,594 మిమీ పొడవుతో మరింత లగ్జరీగా మారింది. కలర్ ప్యాలెట్ లో పాత ఐదు రంగులతో పాటు సరికొత్తగా ‘క్రిస్టల్ బ్లాక్ పెర్ల్’ ఫినిష్ రంగును కూడా కంపెనీ యాడ్ చేసింది.
ఇది కూడా చదవండి: Harley-Davidson X440 S vs Royal Enfield Guerrilla 450: రోడ్‌పై అసలైన కింగ్ ఎవరు? ఫుల్ డీటెయిల్స్!
రిఫ్రెష్డ్ ఇంటీరియర్ క్యాబిన్..
కారు లోపలి భాగంలో డ్యూయల్-టోన్ ఐవరీ, బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ను అందించారు. క్యాబిన్లో కంఫర్ట్ పెంచడానికి 40 శాతం మెరుగైన కూలింగ్ సామర్థ్యం ఉన్న అప్‌గ్రెడెడ్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను అమర్చారు. సెంటర్ కన్సోల్ లో వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే కొత్త 10.1-ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవే కాకుండా రియర్ లాంజ్ సీటింగ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్, రిమోట్ ఏసీ ఆపరేషన్ వంటి లగ్జరీ ఫీచర్లు రైడింగ్ ఎక్స్పీరియన్స్ ను మారుస్తాయి.
అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు..
సేఫ్టీ పరంగా ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌లతో పాటు లెవెల్ 2 అడాస్ (ADAS) టెక్నాలజీని కంటిన్యూ చేశారు. ఈ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా యాడ్ చేసిన 360-డిగ్రీ కెమెరా సిటీ ట్రాఫిక్‌లో కారు ఈజీగా నడపడానికి సహాయం చేస్తుంది. ధరల విషయానికి వస్తే స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ ప్రారంభ ధర పాత కారు లాగే రూ. 12 లక్షలుగా ఉంది. అయితే ఈ:హెచ్ఈవీ (e:HEV) స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ధర మాత్రం దాదాపు లక్ష రూపాయలు పెరిగి రూ. 21 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు చేరుకుంది.
ఇంకా చదవండి

