జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదు: ట్రంప్
వాషింగ్టన్: హోర్మూజ్ సంధిని ఇరాన్ మళ్లీ జలడంపై అమెరికా అధ్యక్షుడు డానాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60రోజుల్లో ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని. పశ్చిమాసియా దేశాలు అమెరికా అందించిన రక్షణ సేవలకుగానూ ఆ డబ్బును తీసుకోకుండా ఏర్పాటు చేసింది. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం 60రోజుల పాటు టోల్-రహిత ప్రయాణం ఉండాలన్నారు. మరోవైపు హార్మూజ్ ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో లేదు, రవాణా నిరంతరాయంగా కొనసాగుతోంది యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్. పరిస్థితి ఇలాగే ఉండేలా అమెరికా చర్యలు తీసుకుంటున్నాయి. శనివారం 17మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో 55 వాణిజ్య నౌకలు జలసంధిని దాటినట్లు తెలిపారు. కాగా, ఇరాన్‌తో అణు చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం స్విట్జర్లాండ్‌కు బయల్దేరింది.
లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు…
ఓ వైపు అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య స్విట్జర్ల్యాండ్లో చర్చలు మొదలుకానుండగా…మరో వైపు లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. సరిహద్దుల వద్ద ఇజ్రాయిల్ ప్రజలు పాలస్థినీయులపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ఉన్నాయి. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి తాము ఎదురు దాడులు చేయవలసి వస్తోందని హెజ్బొల్లా ఆరోపించింది.
పోస్ట్ హోర్మూజ్‌లో టోల్ వసూల్ చేస్తాం మొదట కనిపించింది విశాలాంధ్ర.

