Published on: 11:17 pm, 13 జూలై 2026
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ ఉంటాము. ఈ బాలుడు ఏకంగా రైలు ఎక్కి ఈ బాలుడు అందుబాటులోకి వచ్చాడు. సీఎంతో ఫోటో దిగాలని సాహసం చేశాడు. రైలెక్కి ఏకంగా తాడేపల్లికి చేరుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరి 13 ఏళ్ల సాయి చందు అనే బాలుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అంటే ఎనలేని అభిమానం. తన మాటలలో తరచుగా తన అభిమానాన్ని వెలిబుచ్చేవాడు.
సాయి చందుకు చంద్రబాబు, లోకేష్ ను కలుసుకోవాలని కోరిక కలిగింది. దీంతో ఇంట్లో చెప్పకుండా తణుకు నుంచి రైలు ఎక్కి విజయవాడకు చేరుకుని, అక్కడి నుంచి మంగళగిరి కి వచ్చాడు. ఒంటరిగా అనుమానాస్పదంగా ఉన్న ఆ బాలుడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. బాలుడు తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం. వారి సంబంధికులు రాగానే బాలుడిని అప్పజెప్తామని పోలీసులు తెలిపారు.

