రాంచీ: జార్ఖండ్‌లో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. పని దొరక్క, పని దొరికినా చాచాలని కూలీ ఇస్తానంటూ కూలీలకు ఆవేదన మిగిల్చింది. జార్ఖండ్‌కు చెందిన ఒక దినసరి కూలీ వీడియో నెట్టింట వైరల్ అయింది. 15 రోజుల పాటు రోజుకు 8 గంటలు పనిచేసినప్పటికీ కేవలం 200 రూపాయలు మాత్రమే ఇచ్చారని ఒక మహిళా కూలీ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు నెటిజన్ల గుండెను బరువెక్కించాయి.
తనకు చిన్న పిల్లలు ఉన్నారని.. 200 రూపాయలు ఇస్తే తామే తినాలని, పిల్లలను ఎలా పోషించాలని ఆమె కంటతడి పెట్టుకున్న హృదయవిదారక పరిస్థితి చూస్తే మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి మనసు కన్నీటి సంద్రంగా మారుతుంది. ఆమె కంటి నుంచి వస్తున్న కన్నీళ్లు చూస్తే ఎంత కఠినాత్ముడి గుండెనైనా కరిగిపోతుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్మికుల దుర్భర పరిస్థితులపై ఈ వీడియో చర్చకు దారితీసింది.
జార్ఖండ్‌లో కేవలం 200 రూపాయలు సాలార్‌గా స్వీకరించిన తర్వాత ఒక మహిళ విరుచుకుపడింది. తన బిడ్డను ఇంట్లో వదిలిపెట్టి 15 రోజుల పాటు 8 గంటలు పనిచేసింది.pic.twitter.com/8g1MFUQkml
— వక్వార్ హసన్ (@WaqarHasan1231) మే 24, 2026
చాలా మంది రోజువారీ కూలీల కష్టాలు, వారి పట్ల వ్యవహరించే తీరుపై ఆందోళన వ్యక్తమైంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి కూలీలకు కనీస వేతనం కూడా లేకపోవడంపై నెటిజన్లు ఇచ్చారు. ఇలా బానిసలుగా మార్చుకుని పని చేయించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు పనికెళితే.. పురుషులకు రూ.500, మహిళలకు 400 రూపాయలు తగ్గకుండా కూలీ ఇస్తున్న ఈరోజుల్లో మరీ దారుణంగా 15 రోజులు పనిచేయించుకుని 200 రూపాయలు కూలీ ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు.
►ఇంకా చదవండి | 5 వందల పింఛను కోసం.. మండుటెండలో.. అడవిలో.. అత్తను మోసుకుంటూ 9 కిలోమీటర్ల నడక !

