- 2026లో ముగిసిన అర్థ సంవత్సరం
- ఈ ఏడాది అంతర్జాతీయ సంక్షోభాలు
- భారీగా కుదిపేసిన పశ్చిమాసియా ఇబ్బందులు
2026లో అప్పుడే అర్థ సంవత్సరం ముగిసిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా ప్రపంచ దేశాల్లో అన్ని గందరగోళాలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు కొనసాగుతూనే ఉన్నారు. వెనిజులాపై భారీ ఆపరేషన్ చేపట్టి.. అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికా జైల్లో పెట్టారు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది.

ఖమేనీ హతం
అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీతో పాటు కీలక లీడర్లంతా చనిపోయారు. ఇక ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. ఇతర హార్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కష్టాలు వచ్చాయి. దీంతో అన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వెనిజుల భూకంపం
వెనిజుల అధ్యక్షుడు మదురో కిడ్నాప్ వ్యవహారంపై అంతర్జాతీయంగా సంచలనంగా మారగా.. తాజాగా భారీ భూకంపం వెనిజులాను అతలాకుతలం చేసింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు నేలకూలిపోయాయి. అనేక మంది క్షతగాత్రులయ్యారు.

జీ 7 సదస్సు
ఇక ఫ్రాన్స్ వేదికగా జీ 7 సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ట్రంప్, మోడీ సహా ప్రపంచ దేశ నాయకులంతా. నాయకులంతా సందడి.. సందడిగా కలిసి మెలిసి తిరిగారు. ఇక ఈ సమావేశంలో ఇటలీ ప్రధాని మేలోని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తనతో ఫొటో దిగేందుకు మెలోని బతిమాలిందంటూ చేసిన వ్యాఖ్యలకు ఇటలీ ప్రధాని కౌంటర్ ఇచ్చారు.

ఎపిస్టీన్ ఫైల్
ఇక అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణానికి చెందిన ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలయ్యాయి. ఈ స్కామ్‌లో అనేక మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖంగా మెక్రోసాఫ్ట్ సహా అధినేత బిల్ గేట్స్ పేరు ప్రముఖంగా వినిపించింది. రష్యన్ యువతపై దాడి చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.


