హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఈ నెల 28న పల్స్ పోలియో నిర్వహించనున్నామని, అన్ని శాఖల అధికారులు విజయవంతంగా చేయాలని అడిషనల్ కలెక్టర్ జితేందర్‌రెడ్డి తెలిపారు. పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినం, స్టాప్ డయేరియా క్యాంపెయిన్లపై జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం హైదరాబాద్ కలెక్టరేట్ మందిరంలో బుధవారం జరిగింది.
జితేందర్ రెడ్డి మాట్లాడుతూ స్కూళ్లలో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లను ఆదివారం తెరిచి ఉంచాలని ఉంచారు. డీఎంహెచ్‌వో డాక్టర్పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జూన్ 28న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. బూత్‌లకు రాలేని వారి కోసం జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తామన్నారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జూలై 1 నుంచి 19 ఏండ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అందజేయడం జరిగింది. పల్స్ పోలియో సంబంధిత వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

