ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన
ఈ సందర్భంగా సీబీఐఎన్ @ 361 డిగ్రీలు.. పుస్తకాన్ని ఆవిష్క రించి తొలి ప్రతులను సింగపూర్‌లోని భారత హైకమిషనర్ శిల్పకళా అంబులే, మంత్రి పి.నారాయణ, కాకతీయ కల్చర్ల అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ పుస్తకాన్ని రేపటికోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించారు. దీనిని ఇంగ్లీషులోకి అనువదించి.. తాజాగా సింగపూర్‌లో ఆవిష్కరించారు.
- సీబీఐ @ 361 డిగ్రీలు.. పుస్తకంలో.. దర్శనిక నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను పరిశీలించారు.
- ప్రపంచంలోనే అత్యుత్తమ పాలకులుగా గుర్తింపు ఉన్న సింగపూర్, న్యూజిలాండ్ మాజీ ప్రధానులు లీ క్వాన్ యూ, జేసిందా ఆర్నాడ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ నేతల తరహాలోనే సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఏపీ అభివృద్ధికి విజన్ల రూపకల్పనతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో కొనసాగుతున్న నిర్ణయాలను వివరించారు.
- బాహ్య ప్రపంచానికి తెలియని అంశాలు సీబీఎన్ @ 361 డిగ్రీల పుస్తకంలో ప్రస్తావించబడింది. తద్వారా చంద్రబాబు కీర్తి.. ప్రపంచ దేశాలకు కూడా వ్యాపించనుంది. అంతేకాదు.. ఒక తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రిపై జాతీయం నుంచి అంతర్జాతీయ స్థాయికి పుస్తకం ముద్రించడం కూడా ఇదే తొలిసారి.

