Peddi Movie Collections : ప్రస్తుత ఓటీటీ యుగం లో ఒక సినిమాకు ఓపెనింగ్స్ రావడమే చాలా కష్టం. ఈమధ్య కాలం లో స్టార్ హీరోల సినిమాలకు కూడా సరిగా ఓపెనింగ్ పడలేదు. ఓపెనింగ్స్ రావడమే గగనం అని అనుకుంటున్న సమయం కొన్ని కంటెంట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం. నాల్గవ రోజున ఏకంగా 20 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు , కేవలం తెలుగు రాష్ట్రాల నుండి రావడం చాలా తరచుగా మనం చూస్తుంటాము . అలాంటి అరుదైన సినిమాల గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సినది , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ చిత్రం గురించి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు నాల్గవ రోజున ఏకంగా 27 కోట్ల 86 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ రేంజ్ షేర్ , రేపు భవిష్యత్తులో రాజమౌళి సినిమాకు రావడం కూడా కష్టమే అనుకోవచ్చు. ఆ తర్వాత స్థానం లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రం నిలిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి నాల్గవ రోజున 26 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానం లో రీసెంట్ గా విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం నిల్చింది. భారీ అంచనాల విడుదల , మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 20 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి నాల్గవ రోజున 20 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఏకైక మూడు సినిమాలు ఇవే. ‘పెద్ది’ చిత్రం వచ్చిన చరణ్ నాల్గవ రోజున నైజాం ప్రాంతంలో వసూళ్లు , రామ్ గత చిత్రం ‘గేమ్ చెంజర్’ కి మొదటి రోజు కూడా రాలేదు. దీనిని బట్టీ ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

