తెలంగాణ:65వ రహదారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దులచెరువు స్టేజ్ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…మునగాల మండలం వెంకట్రామాపురం జాతీయ గ్రామానికి చెందిన కీత రాజయ్య (54) మరియు ఆయన కుమార్తె సునీత(40) బ్యాంక్ పని నిమిత్తం టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనంపై మునగాల మండల కేంద్రానికి వెళ్లి,బ్యాంక్ పని పూర్తి చేసి తిరిగి మాధవరం వెళుతుండగా, మొద్దులచెరువు స్టేజ్ వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుండి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.
వాహనం డీకొన్న వేగానికి ఇద్దరూ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
స్థలానికి చేరుకున్న పోలీసులు,అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను పరిశీలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు, ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ రత్నం తెలిపారు
.

