– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: ఆంద్రప్రదేశ్‌లోని ఎస్ఎస్ఆర్ (పాడేరు) జిల్లా ముంచంగిపుట్టు మండలం రంగభయలు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బుడ్డపనస,గొబ్బరిపడ, నువ్వగూడ,ఇతర గ్రామ పివిటి ఆదివాసీలు రోజుకు సుమారుగా 7 కిలో మీటర్లు చాలా ఎత్తైన అడవుల నుంచి నిత్యావసర సరుకులకు,ఆరోగ్య అత్యవసర సేవలకు వెళ్లాలంటే ఘాటు ఎక్కివెళ్లాల్సిందే.
లక్ష్మీపురంలో బుధవారం జరిగే వారపు సంత చేసి వెళుతున్నప్పుడు తీసిన వీడియోలో ఆదివాసీలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొర్ర త్రినాధ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 80 సం:కావిస్తున్న ఆదివాసీలకు రహదారి సౌకర్యం కల్పించడం లేదని, ప్రభుత్వం స్పందించి పీఎం జన్ మన్ ద్వారా అయిదు ఫారెస్ట్ అధికారులు అనుమతి నిరాకరణతో ఆగి ఉన్న రోడ్డును వెంటనే అనుమతులు క్లియరెన్స్ చేసి రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
– ప్రకటన –

