72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ప్రభాస్, నాగ అశ్విన్ సినిమా కల్కి 2898 AD సినిమాకు బెస్ట్ పాపులర్ ఫిలిం అవార్డ్ దక్కింది. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో కూడా కల్కి 2898 సినిమాకు గానూ నితిన్ జిహాన్ చౌదరికి దక్కింది.
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు పుష్ప 2 సినిమాకు గానూ సుకుమార్ సొంతం చేసుకున్నాడు. బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు కూడా పుష్ప-2కు దక్కింది. కాస్ట్యూమ్ దీపాలే నూర్, శీతల్ శర్మలకు ఈ అవార్డు దక్కింది. బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ అవార్డ్ లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి దక్కించుకున్నాడు.
- ఉత్తమ తెలుగు ఫిలిం: కమిటీ కుర్రోళ్ళు- డైరెక్టర్: యదు వంశీ
- ఉత్తమ మేకప్: కమిటీ కుర్రోళ్ళు , మేకప్ ఆర్టిస్ట్ రవికుమార్
- బెస్ట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్: లక్కీ భాస్కర్ , డైలాగ్ రైటర్ అట్లూరి వెంకీ
- బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్: పుష్ప 2- సుకుమార్
- బెస్ట్ చైల్డ్రన్స్ ఫిలిం: చిన్న కథ కాదు – డైరెక్టర్ నందకిషోర్ ఈమని
- బెస్ట్ పాపులర్ ఫిలిం: కల్కి 2898 AD, డైరెక్టర్ నాగ్ అశ్విని
- బెస్ట్ కాస్ట్యూమ్ పుష్పం 2 , కాస్ట్యూమ్ దీపాలే నూర్ శీతల్ శర్మ
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: కల్కి 2898 నితిన్ జీహాన్ చౌదరి
- బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: చిన్న కథ కాదు, చైల్డ్ ఆర్టిస్టు అరుణ్ దేవ్ పోతుల

