విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ప్రకారం భారత దేశ జనాభా గణన 2027 ప్రకారం మే 18 వ తేదీ నాటికి 95 శాతము పూర్తి చేసినట్లు తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ మొత్తంలో ఉన్న వి 16,344 కాగా ఇప్పటివరకు జనాభా గణన మా సిబ్బంది అధికారులు ద్వారా 15,667 ఇండ్లు పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు. హౌస్ వర్డ్స్ లో 11,481(కుటుంబంలో ఉన్నవాళ్లు) కలవన్నారు. ఈ కార్యక్రమం మే 30వ తేదీ వరకు ఉంటుందని, నూరు శాతం పూర్తి అని వారు తెలిపారు. ఈ జనాభా గణన లెక్కల కోసం ఎనిమినేటర్లు 96 మంది సూపర్వైజర్లు 16 మంది తమ విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. కేవలం గృహ స్థితిగతులను మౌఖికంగా కుటుంబం సమక్షంలోనే అడుగుతున్నామని చెప్పారు. మా సిబ్బంది ఆధార్ నెంబరు కానీ బ్యాంకు అకౌంట్ ఖాతా నెంబర్ గాని అడగడం లేదని వారు స్పష్టం చేశారు. కొంతమంది అపోహలకు వెళ్లి మా సిబ్బందికి సహకరించడం లేదని వారు తెలిపారు. మా సిబ్బంది ఎవరైనా ఆధార్ నెంబర్ కానీ బ్యాంకు ఖాతా నెంబర్ గాని అడిగినచో చెప్పవద్దని కూడా వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో. హేమలత ఉన్నప్పటికీ

