ముంబై: పూణే-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై, ముంబై నుంచి పూణేకు వెళ్లే దారిలో ఒక స్కోడా కారు ఘోర ప్రమాదంలో నుజ్జునుజ్జయింది. డ్రైవర్ మితిమీరిన వేగంతో కారుపై నియంత్రణ కోల్పోవడంతో.. కారు దూసుకెళ్లి డివైడర్‌ను ఢీ కొట్టింది. స్పీడ్‌లో ఢీ కొట్టడంతో.. ఈ ధాటికి.. డివైడర్ షీట్ ఓవర్ నేరుగా కారులోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన జరిగిన వెంటనే ఐఆర్బీ బృందాలు, పోలీసులు, అంబులెన్స్‌లతో స్పాట్‌కు చేరుకున్నారు. బాధితులను.. గాయపడిన ప్రయాణికుడిని బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్స్.. కారు తలుపులు, డివైడర్ షీట్లను కత్తిరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స ఆసుపత్రికి చికిత్స.
యాక్సిడెంట్స్కు చాలా కారణాలున్నా వాటిలో ప్రధానమైనవి మాత్రం అతివేగం, నిర్లక్ష్యం. వీటివల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. నిర్లక్ష్యం అంటే ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేయడం, అజాగ్రత్తగా బండిని నడపడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ఓవర్ టేకింగ్. వేగం, నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదాల్లో గాయపడిన వాళ్ల సంఖ్య కూడా పెరిగింది.
నిజానికి మిగిలిన రోడ్లతో హైవేలు బాగుంటాయి. వెడల్పుగా ఉండటంతో పాటు గుంతలు తక్కువగా కనిపిస్తాయి. కానీ, వీటి మీదే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. చనిపోయేవాళ్లు కూడా ఎక్కువని ఎన్సీఆర్ చెప్తోంది. దీన్ని బట్టి.. వేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలని సూచిస్తుంది.
పూణె-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం 🚨 స్కోడా కారుతో భారీ ప్రమాదం జరిగింది. #పూణె–#ముంబయి ముంబయి-పుణె లేన్‌లో ఎక్స్‌ప్రెస్ వే. నివేదికల ప్రకారం, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. షాకింగ్ లో… pic.twitter.com/kcxoDRkPeV
— సిరాజ్ నూరానీ (@sirajnoorani) మే 20, 2026

