తెలంగాణ:నల్గొండ జిల్లా కేంద్రం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం(సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం) భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఉద్యోగులు,ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాత భవనంలోనే ప్రస్తుత కార్యాలయ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
బుధవారం నుంచి స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడి కిందపడడంతో భయాందోళనకు గురయ్యారు.ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
నిత్యం ప్రజలు,సిబ్బందితో కిటకిటలాడే ఈ భవన్పై అధికారులు వెంటనే దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

