ఆ ఎమ్మెల్యేలంతా సూపర్ సీనియర్లు. బరిలోకి దిగితే ఒక్కొక్కళ్ళది బాహుబలి రేంజ్ ఇమేజ్. కానీ…, సెల్ఫ్ పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీకి, ప్రభుత్వానికి ఇవ్వడం లేదట. ప్రతిపక్షం రోడ్డెక్కి పొట్టు పొట్టున తిడుతున్నా… ఖండించడానికి వాళ్ళకు నోళ్ళు పెగలడం లేదట. తొడగొట్టి ఛాలెంజ్ చేయాల్సిన శాసనసభ్యుల్లో ఎందుకా నిర్లిప్తత….? పార్టీల అధినేతలను దుమ్మెత్తి పోస్తున్నా లేదన్న విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి? ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ కూటమిలో ఇప్పుడో విచిత్రమైన ధోరణి ఏర్పడింది. మొత్తం 15 స్థానాలకుగాను NDA 13 చోట్ల విజయం సాధిస్తే….పాడు, అరకు సీట్లలో వైసీపీ పట్టు నిలబెట్టుకుంది. జనసేన ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకుని ఇక్కడ నుంచే పటిష్టమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికలు చేసుకుంటోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఫోకస్ చేయడంతో…. అనేక కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. డేటా సెంటర్స్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇతర ప్రారంభాలతో ఒక రకమైన అభివృద్ధి వాతావరణం క్రియేట్ అవుతోంది. అయితే… దీన్ని క్యాష్ చేసుకుంటూ…. రాజకీయంగా వాడుకోవడంలో విఫలమవుతున్నామన్న చర్చలు కూటమిలో జరుగుతున్నాయట. జరుగుతున్న అభివృద్ధి మీద టీడీపీ అధిత్వం విస్తృతంగా ప్రచారం చేస్తుంటే…. పార్టీ శాసన సభ్యులు మాత్రం ఆ విషయంలో వెనుకబడుతున్నట్టు చెబుతున్నారు. స్థాయి ప్రకటనలు చేసినా… అవేవీ సోషల్ మీడియా జిల్లాను దాటి ప్రజలను ఆలోచింపజేసే స్థాయిలో ఉండటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ విషయం టీడీపీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిందట. జిల్లాకు వస్తున్న ప్రాజెక్టులపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను… వైసీపీ వెంటబడి మరీ ఉమ్మడి క్రెడిట్ చోరీ ఆరోపణలు చేస్తున్నారు. రైల్వేజోన్ వంటి విషయంలోనూ టీడీపీ చేసుకుంటున్న క్లెయిమ్‌ను వాపక్షాలు ఎండగడుతున్నాయి. ఉమ్మడి కృషి ఫలితంగా మధ్యలో మీ పబ్లిసిటీ ఏంటి గురూ…అంటూ చురకలు అంటిస్తున్నారు. KK లైన్ లేకపోతే… జోన్ వల్ల ప్రయోజనం ఏంటో చెప్పాలని, డేటా సెంటర్ల వల్ల వచ్చే ఉద్యోగాలు , ఉపాధి అవకాశాలపై నిజాలు బహిర్గతం చేయడానికి వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఆ రకంగా విపక్షాలు ధ్వజమెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తుంటే తలుపు చెక్కలతో తగులుకోవాల్సిన కూటమి ఎమ్మెల్యేలు.. తమల పాకులు పట్టుకుని తిరుగుతున్నారనే అపప్రద ఉంది. ఇక, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల విశాఖ వేదికగా ప్రభుత్వం ముందు కీలక అంశాలు చర్చకు పెట్టారు. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే వాటి పరిష్కారం కోసం వున్న మార్గాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన్ని ప్రభుత్వం ఎంతగా తీసుకుందో తెలియదు… ఒక సెక్షన్ ప్రజల్లో విస్తృతమైన చర్చ అయితే జరిగింది.
అభివృద్ధి చేసిన ప్రజలకు చెప్పండని హైకమాండ్ పోరు పెడుతున్నా… ఎమ్మెల్యేలు మాత్రం తూ.తూ. మంత్రం యవ్వరాలే చేస్తున్నారట. ఇక ఎమ్మెల్యేలు నియోజకవర్గాల స్థాయిలో ఉన్నవారు గ్రీవెన్స్లలో ఎక్కువ సామాజిక పెన్షన్లు, వైద్య సంబంధిత అభ్యర్థనలు వాటిని పరిష్కరించడం జఠిలంగానే వుందని అంటున్నారు. ఈ కారణాలను కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజలకు కూడా చూపించకుండా ఉంటున్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు ఎక్కువయ్యాయి. పులిమీద పుట్రలా పెట్రోల్, డీజిల్ బాదుడు తోడైందని కేడర్ కలవరపడుతోంది. అటు వైసీపీ మాత్రం గట్టిగానే ఇరుకున పెడుతోంది. కానీ… కౌంటర్ చెయ్యాల్సింది ఎమ్మెల్యేలు మాత్రం కామ్‌గా ఉండటం వల్ల టీడీపీ పెద్దలకు కూడా మింగుడు పడ్డం లేదట. ఎవరికి వాళ్ళు నియోజకవర్గం, అక్కడ పరిణామాలు చూస్తున్నారు తప్ప విపక్షాన్ని ఇరుకునపెట్టే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. చివరికి పవన్, చంద్రబాబు లేకుండా, లోకేష్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా… ఖండించాలన్న స్పృహ పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోందట ద్వితీయ శ్రేణి. పల్లా శ్రీనివాస్, అనిత, బండారు లాంటి నేతలు కొంతమేర ఎదురు దాడి చేస్తున్నా…. వాళ్ళ లక్ష్యం డైరెక్ట్‌గా ప్రతిపక్ష నేత కావడంతో పెద్దగా ప్రజల్లోకి చేరడం లేదు. అదే సమయంలో, ఇతర విపక్షాలు లేవనెత్తుతున్న విమర్శలు మాత్రం ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇటీవల పెన్షన్లకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు,సీఎంపై ఏకవాక్య ప్రయోగాలు చేశారు. కానీ… నిశితమైన, నిర్ధిష్టమైన ఆరోపణలు వస్తున్నప్పుడు వాటిని ఖండించడం…నిలబెట్టి కడిగేయడంలో అధికార కూటమి ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారన్న అసహనం మూడు పార్టీల ద్వితీయ శ్రేణిలో పెరుగుతోంది. వాళ్ళలో చలనం కోసం పార్టీల పెద్దలు ఏం చేస్తారు? చేసినా రియాక్షన్ ఎలా ఉంటుందన్న డౌట్స్ కేడర్‌లో పెరుగుతున్నాయి.

