సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం మ్యాడ్ భామ రేబా జాన్ సందడి చేస్తోంది. ప్రస్తుతం తొలి బిడ్డ కోసమే ఈ భామ.. తాజాగా బేబీ బంప్‌తో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మెటాలిక్ బ్లూ ఫిట్టెడ్ గౌన్‌లో రేబా ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. థై-హై స్లిట్, మినిమల్ జ్యువెలరీ, సింపుల్ హెయిర్ స్టైల్‌తో స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయింది. ప్రెగ్నెన్సీ గ్లో ఆమె అందాన్ని మరింత పెంచేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న రేబా.. పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించినా, అభిమానులతో మాత్రం సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటుంది. ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఈ భామ కొత్త ఫొటోలకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల మ్యాడ్ స్క్వేర్‌లో స్వాతి రెడ్డితో కలిసి చేసిన స్పెషల్ సాంగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన సీఎం విజయ్ చిత్రం జననాయకన్, సకలకళ వల్లభ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


