మేషం
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు నిర్వహించారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది. పాత ఋణాల నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఎక్కువగా కష్టపడితే తప్ప పనులు పూర్తి కావు అని భావన ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. స్థూల ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ని రాశి వారు ప్రతిరోజు దుర్గా స్తోత్రం చదవండి. ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. చుట్టుపక్కల వారితో ఆస్థి విషయాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన పెట్టుబడులు పెడతారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేయబడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూరవిద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ముఖ్యమైన పనులలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. భూసంబంధమైన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. నలుగురిలో ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రతిరోజు కూడా హనుమాన్ భక్తులతో దీపారాధన చేయండి. మీ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటపడేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధునం
మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉన్నవారికి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లభించే అవకాశం ఉంది. ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు కలుగుతాయి. రుణాలు చాలా వరకు తీరుస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు. ప్రతిరోజు కూడా ఖడ్గమాల స్తోత్రం చదవండి. సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎంతో కాలంగా సంతానం కోసం సిద్ధంగా ఉన్నవారు ఈ వారం శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. సంతానం యొక్క ఉద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ దీపారాధన చేయండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి ఆరు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. జీవిత భాగస్వామితో బంధువులతో విభేదాలు వచ్చే పరిస్థితి ఉంది. ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు గణపతి స్వామి వారికి అర్చన లేదా అభిషేకం చేయించి ప్రారంభించండి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహారిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ సంఘంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు మీ వారం అనుకూలంగా ఉండవచ్చని చెప్పవచ్చు. వాహన యోగం ఉన్నది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారికి పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. 8 శనివారాలు తైలాభిషేకం చేయించండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద పెట్టకూడదు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్య
కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన గృహ నిర్మాణం అంటే కల నెరవేరుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. మీ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తుల
తులా రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన విషయాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున పత్రముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. రాశి వారు ప్రతి రోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి మంగళవారం మరియు శుక్రవారం రోజున ఆరా వారి కుంకుమతో అమ్మవారికి పూజ చేయాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సహోదరి సహోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేసిన పనులు అనుకూలంగా సాగుతాయి. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. టెండర్లు లైసెన్సులు లీజులు లభిస్తాయి. రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో కస్తూరి పసుపుతో అమ్మవారికి అభిషేకం చేయండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 రంగు మెరున్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు
ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలపరంగా మీరు కోరుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఇతరులు ఆశించిన సహాయం అందుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భూ సమస్యలు తీరుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. హనుమాన్ సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ చేయించారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బిడ్డకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకరం
మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మరొకరి సంపాదన సృష్టించబడింది. ఆర్థిక భారం తేలికవుతుంది. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి మీ పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ పరంగా మీరు కోరుకున్న మార్పులు జరుగుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మంగళవారం మరియు శుక్రవారం రోజు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు మెరున్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నడిచిన రెండు మూడు వారాల కంటే బాగుంటుంది అని చెప్పవచ్చు. స్వగృహ నిర్మాణం పూర్తవుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగ పరంగా మీరు కోరుకున్న స్థాయిని చేరుకుంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ధన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. పాస్పోర్ట్ వీసా వంటి అంశాలు లాబిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

