Professor Nageshwar Controversy: ఏపీలో గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ భేటీ వివరాలను లీక్ చేశారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇది పెద్ద ఎత్తున దుమారానికి దారితీసింది. పార్టీల మధ్య వైరుధ్యం ఉందన్న కోణంలో ప్రచారం నడిచింది. జనసేన సీరియస్ అయింది. ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదైంది. మళ్ళి టిడిపిపై జరుగుతున్న కుట్రగా భావించి గట్టి నిర్ణయాల చర్యలను వేయాలని నిర్ణయించింది. మరోవైపు సోషల్ మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ బహిరంగంగానే స్పందించారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటన చేశారు.
* అమిత్ షా తో భేటీ లీక్
కొద్ది రోజుల కిందట కేంద్ర శాఖ మంత్రి అమిత్ షా ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని కోరారని.. అందుకు అమిత్ షా నిరాకరించారని.. చంద్రబాబు ఇనిస్టాంట్ ఫ్రెండ్.. జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారని.. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్లొద్దని సూచించారని.. అమిత్ షా పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకినట్లు చెప్పారు. జనసేన కోర్ కమిటీలో ఇదే పరిశీలన నాదెండ్ల మనోహర్ తో పవన్ కళ్యాణ్ చెప్పించారని.. జనసేన వర్గాల నుంచి తనకు సమాచారం అందిందని ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటపెట్టారు టీవీ డిబేట్లో. అప్పటినుంచి రచ్చ రచ్చ నడుస్తోంది. ఇదిగో మాకు కేంద్రం మద్దతు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెగ హడావిడి చేసింది.
* ఆ భయంతోనే వెనక్కి..
అయితే ఈ ఎపిసోడ్ పై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే తనకు ఎంతో గౌరవం అని.. అటువంటి వ్యక్తి ఇలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడకుండా తీవ్ర పదజాలంతో ఉన్నాడు. అంతటితో ఆగకుండా జనసేన తరపున ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకోవైపు కూటమి విచ్ఛిన్నం జరుగుతున్న కుట్రగా టిడిపి పొలిట్ బ్యూరోలో నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గతంలోనే అడ్డగోలుగా మద్దతు తెలిపారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అన్ని వర్గాలను వ్యతిరేకించగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని సమర్థించారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు సంబంధిత ఛానల్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం పరిణామంతో కేసులు నమోదుతో పాటు అరెస్టులు ఉంటాయని భావించారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అన్నింటికీ మించి తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని భావించి ఎటువంటి ఆధారాలు లేవని.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు ప్రొఫెసర్ నాగేశ్వర్..

