ఆంధ్రప్రదేశ్:ఈద్అల్-అధా(బక్రీద్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ.ఇది ఇస్లామిక్ క్యాలెండర్లోని( Islamic calendar ) చివరి నెల అయిన ధు అల్-హిజ్జా 10వ రోజున వస్తుంది.
ఈ సారి బక్రీద్ పండుగ తేదీపై గందరగోళం.దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో పండుగ తేదీ మారిందని, పండుగను అనుకున్న రోజు తర్వాత నిర్వహించుకోవాలని ముస్లిం మతపెద్దల ప్రదర్శన.
దీంతో ఏపీ ప్రభుత్వం బక్రీద్ సెలవు తేదీ మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ ప్రభుత్వం మొదట 27వ తేదీన అధికారికంగా బక్రీద్ సెలవు ప్రకటించింది.
ఇప్పుడు మార్పు చేస్తూ 28వ తేదీకి సెలవు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దుల్ హిజ్జా ( Dhul Hijjah )నెలవంక దర్శనం ఆలస్యంగా పండుగ తేదీ ఒకరోజు తర్వాత మారింది.బక్రీద్ గురించి ముస్లిం మత పెద్దలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.ఈసారి బక్రీద్ పండుగను మే 28 గురువారం జరుపుకుంటారని,దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అధికారిక సెలవును ఒక రోజు వాయిదా వేసి 28వ తేదీకి మార్చాలని ముస్లిం మత పెద్దలు సూచించారు.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.నెలవంక కనిపిస్తేనే పండుగ తేదీలకు ఆధారం కావడంతో జీ ఖాదా నెల 30 రోజులు పూర్తవుతుందని నిర్ణయించారు.ఈ నేపథ్యంలో మే 19న జిల్ హిజ్జా తొలి రోజుగా ప్రకటించారు.దాంతో బక్రీద్ పండుగ మే 28న జరగనుంది.
ఇప్పటికే ప్రభుత్వం మే 27న అధికారిక సెలవుగా ప్రకటించడంతో ఉద్యోగులు, విద్యార్థులు,వ్యాపార వర్గాల్లో కొంత అయోమయం.ముఖ్యంగా ముస్లిం ఉద్యోగులు,విద్యార్థులు పండుగ రోజు సెలవులు ఉండేలా ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
మతపెద్దలు కూడా నెలవంక ఆధారంగా నిర్ణయించిన తేదీ ప్రకారమే పండుగ నిర్వహించాల్సి ఉంటుంది,అందువల్ల సెలవు తేదీ కూడా మారాల్సిందేనని స్పష్టం చేయడంతో మార్పు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.


