2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు 15 విభిన్న ఫ్రాంచైజీలు ఆడాయి. 2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ రాకతో జట్ల సంఖ్య 10కి చేరింది. అయితే.. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో ఒక్కటైన బీహార్‌కు ఇప్పటివరకు ఐపీఎల్లో లేదు. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా బీహార్‌కు ప్రత్యేక ఐపీఎల్ జట్టు ఉండాలని గట్టిగా ఆకాంక్షించారు.
బీహార్ మట్టిలో అద్భుతమైన క్రికెట్ ప్రతిభ దాగి ఉందని ఆయన చెప్పారు. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఈ కిషన్ (పాట్నా), రాజస్థాన్ రాయల్స్ ఆడుతూ అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి సెంచరీలతో రికార్డులు సృష్టించిన సంచలనం వైభవ్ సూర్యవంశీ (సమస్తీపూర్), అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న సాకిబ్ హుస్సేన్ (గోపాల్‌గంజ్) వంటి బీహార్ దేశానికి అందించినట్లు గుర్తు చేశారు. ఇంతటి ప్రతిభ, బీహార్‌కు సొంత క్రికెట్ గుర్తింపు లేకపోవడం తనను ఎప్పుడూ కలచివేస్తుందని అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరహాలోనే బీహార్‌కు కూడా ఒక అజేయమైన జట్టు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్ యువతకు ప్రపంచ మౌలిక సదుపాయాలు, మద్దతు లభిస్తే, అక్కడి నుండి వచ్చే జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం తాను పూర్తి స్థాయిలో, నిరభ్యంతరంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
విధ్వంసకర జట్టుగా మారుతుందా? నెటిజన్ల అభిప్రాయం..
అనిల్ అగర్వాల్ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు భారీగా నమోదవుతున్నారు. ఒకవేళ బీహార్‌కు కొత్త ఐపీఎల్ జట్టు వస్తే.. స్థానిక స్టార్లయిన ఇషాన్ కిషన్, రికార్డుల వీరుడు వైభవ్ సూర్యవంశీలను ఆ ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే గనుక, అది ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా మారుతుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల కాంబినేషన్ ఓపెనింగ్‌లో వస్తే CSK, MI, RCB వంటి దిగ్గజ జట్ల బౌలింగ్ లైనప్‌లు కూడా తట్టుకోలేవని విశ్లేషిస్తున్నారు.
సాధ్య సాధ్యాలు..
అనిల్ అగర్వాల్ వంటి బిలియనీర్ ‘అన్‌కండిషనల్ సపోర్ట్’ ఇస్తానని ప్రకటించడం వల్ల ఫ్రాంచైజీ కొనుగోలుకు, భారీ పెట్టుబడులకు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. బీహార్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అపారం. కొత్త జట్టు వస్తే వ్యూయర్షిప్, స్పాన్సర్షిప్ పరంగా బీహార్ ఐపీఎల్ జట్టుకు భారీ మార్కెట్ లభిస్తుంది. ఇషాన్, వైభవ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఇప్పటికే నిరూపించుకున్నారు కాబట్టి, జట్టుకు లోకల్ ఐడెంటిటీ మరియు బ్రాండ్ వాల్యూ త్వరగా వస్తుంది.
మీరు ఇప్పుడు కాదు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ కి తరహ్ బేమిసల్ బిహార్ కి భీ ఏ హాయిం?
బిహార్ కి మిట్టి నే దేశ్ కో బహుత్ సే బెహతరీన్ క్రికెట్ ఖిలాడి యిది.
పటనా మెన్ జన్మే ఈషాన్ కిషన్ నే సబసే కం గెండోం మెన్ ODI డబుల్ సెంచరీ లాగాయ్. సమస్తీపూర్… pic.twitter.com/bgScCh40Zd
— అనిల్ అగర్వాల్ (@AnilAgarwal_Ved) మే 22, 2026
ఒకవేళ కొత్త జట్టు వచ్చినా, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీలను నేరుగా జట్టులోకి తీసుకోలేరు. వారు ప్రస్తుతం ఆడుతున్న ఫ్రాంచైజీలు వదిలేస్తేనే, వేలంలో భారీ ధర చెల్లించి దక్కించుకోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ స్థాయి మ్యాచ్‌లను అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్టేడియాలు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీహార్‌లో ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సి ఉంది. ప్రస్తుతం ఐపీఎల్లో 10 జట్లు ఉన్నాయి. లీగ్ విండో పరిమితుల వల్ల త్వరలోనే మరో కొత్త జట్టును చేర్చుకునే ఆలోచనలు లేవని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ ప్రస్తుత సూచనప్రాయంగా తెలిపారు. 2028 నాటికి మ్యాచ్‌ల సంఖ్య 74 నుండి 94కి పెంచే అవకాశం కనిపిస్తుంది, అది 10 జట్ల మధ్యే ‘హోమ్ అండ్ అవే’ ఫార్మాట్లో జరిగే అవకాశం ఉంది. కొత్త జట్ల చేరికపై బీసీసీఐ నుంచి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, అనిల్ అగర్వాల్ చేసిన ప్రతిపాదన బీహార్ క్రికెట్ అభిమానుల్లో ఒక కొత్త చర్చకు, ఆశకు తెరలేపింది.

