IPL 2026 RR VS MI తాజా అప్డేట్: మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ అద్భుతం చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘన విజయం ఉనికి. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ముంబై ఇండయన్స్ పై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ (26 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.
ఛేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన ముంబై 9 వికెట్లకు 175 పరుగులకే పరిమితమైంది. సూర్య కుమార్ యాదవ్ స్టన్నింగ్ ఫిఫ్టీ (42 బంతుల్లో 60, 3 ఫోర్లు, 4 సిక్సర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలర్లో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ కు చేరిన నాలుగో జ’ట్టుగా రాజస్థాన్‌లో చేరింది. ఇప్పటికే రాయల్ చాలేంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరిన సంగతి తెలిసిందే. క్వాలిఫయర్ -1లో ఆర్సీబీతో జీటీ, ఎలిమినేటర్ ఎస్ ఆర్ హెచ్‌తో రాయల్స్ తలపడనున్నాయి. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. దీనితో కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ అప్ర-ధాన్యంగా మారింది.
బ్యాట్‌తో 🔥
బంతితో 🔥🔥జోఫ్రా ఆర్చర్ క్లచ్‌లో వస్తున్నాడు #RR 🩷
నవీకరణలు ▶️ https://t.co/h2ze7K0gd6#TATAIPL | #ఖేల్ బిందాస్ | #MIvRR | @రాజస్థాన్ రాయల్స్ pic.twitter.com/En2h01xvdC
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 24, 2026
పవర్ ప్లేలోనే ఖతం..
భారీ టార్గెట్ తో బ రిలోకి దిగిన ముంబైకి ఏదీ క లిసి రాలేదు. ఓవర్ ఆరంభంలోనే వెటరన్ రోహిత్ శర్మను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో వన్ డౌన్ బ్యాటర్ నమన్ ధీర్ (6)ను అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు. ఇక ఒక ఫోర్, సిక్సర్ తో మంచి టచ్ లో కనిపించిన ర్యాన్ రికెల్టన్ (12)ను నాండ్రే బర్గర్ ఔట్ చేశాడు. కాసేపటికే బ్రిజేశ్ శర్మ.. అద్భుత బంతితో తిలక్ వర్మ (3)ను బౌల్డ్ చేయడంతో పవర్ ప్లేలోపలే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ఓవరాల్ గా పవర్ ప్లేలో 49 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అని కొందరు సందేహించారు #RRయొక్క పోరాటం, కానీ వారు ఏమి మర్చిపోయారు #హల్లాబోల్ 💪 ని సూచిస్తుంది
ప్లేఆఫ్స్‌లో ఉన్నారు! లీగ్ దశ అధ్యాయం ముగుస్తుంది మరియు కీర్తి కోసం వేట ఇప్పుడు ప్రారంభమవుతుంది! 🏆💗
తదుపరి వాటిని చూడండి #TATAIPL 2026, ఎలిమినేటర్ 👉 #SRHvRR | బుధ, 27 మే, 6:30 PM#MIvRR | #జోఫ్రా ఆర్చర్,… pic.twitter.com/t0cBCpKUGr
— స్టార్ స్పోర్ట్స్ (@StarSportsIndia) మే 24, 2026
సూర్య ఒంటరి పోరాటం..
మరోవైపు హెల్మట్ కు బౌన్సర్ కు తగిలిన తర్వాత పట్టుదలగా ఆడిన సూర్య కుమార్ జట్టును ముందుండి నడిపించాడు. విల్ జాక్స్ (33) తో కలిసి స్కోరు బోర్డును పరుగెలెత్తించే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో వీరిద్దరూ ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించడంతో ముంబై కోలుకుంది. అయితే కాసేపటికే జాక్స్ ఔటవడంతో ముంబై సగం వికెట్లను కోల్పోయింది.
ఈ దశలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 34, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నంత సేపు వేగంగా ఔటయ్యాడు. అయితే కీలక దశలో తను ఔట్ కావడం, 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న కాసేపటికే సూర్య కూడా ఔటవడంతో ముంబై ఓటమి పాలైంది. మిగతా బౌలర్లలో బర్గర్, బ్రిజేశ్, యశ్ రాజ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఆర్చర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇంకా చదవండి

