200 KMPH కార్ డ్రైవ్ హైదరాబాద్: అది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. మనోడు కొత్త కారు కొన్నాడు.. ఏకంగా గంటకు 200 వేగంతో నడిపాడు. అదే కాదు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. లైకుల కోసం.. కామెంట్ల కోసం కక్కుర్తి పడ్డాడు. చివరికి ఏం జరగాలో అది జరిగింది.
హైదరాబాద్ నగరానికి చెందిన యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తి వోక్స్ వ్యాగన్ కంపెనీకి సంబంధించిన కార్ కొనుగోలు చేశాడు. దానిని అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా డ్రైవ్ చేశాడు. గంటకు 200 వేగంతో నడిపాడు. దానిని వీడియో రికార్డ్ చేసి.. దానిని కాస్త సోషల్ మీడియాలో వదిలాడు.. కామెంట్లు.. లైకులు వస్తాయని భావించి అతడు ఆ పని చేశాడు. కానీ తెలంగాణ పోలీసులు అతని మీద నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో అతని వ్యవహారం చూసి… ఘన సన్మానం చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు మీద 200 రేడియో వేగంతో వాహనాలు నడపడానికి అవకాశం లేదు. అతడు దూకుడుగా కారు నడుపుతున్నప్పుడు గుర్తించి అరెస్ట్ చేశారు.. అంతేకాదు ఔటర్ రింగ్ రోడ్డు మీద వేగంతో ఎవరైనా వెళ్తే ఇదే పని అని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఆ తర్వాత వారికి తమదైన శైలిలో పనిష్మెంట్ ఇస్తున్నారు. యశ్వంత్ రెడ్డి, కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత.. మితిమీరిన వేగంతో వెళ్లడాన్ని తెలంగాణ పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
ఔటర్ రింగ్ రోడ్డు మీద అత్యంత ఎక్కువగా ఉండే నార్సింగి పుప్పాలగూడ మధ్యలో అతడు విపరీతమైన వేగంతో వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. అందువల్లే అతడిని పట్టుకొని పనిష్మెంట్ ఇచ్చారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసి ఎవరైనా ఈ స్థాయిలో వేగంతో వెళితే తమ పనిష్మెంట్ ఇలానే ఉంటుందని పోలీసులు తెలంగాణ చేతుల్లో చూపించారు.. పాపం యశ్వంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో లైకుల, కామెంట్ల పిచ్చి వల్ల చివరికి పోలీస్ స్టేషన్ పాలు కావాల్సి వచ్చింది.
హైదరాబాద్లో గంటకు 200 కి.మీ #ORR కోసం @instagram రీల్స్: @సైబరాబాద్ పోలీసులు అరెస్టు #ప్రైవేట్ ఉద్యోగి కోసం #ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్
32 ఏళ్ల వ్యక్తి #పుప్పాలగూడ చేత అరెస్టు చేయబడ్డాడు #నార్సింగి ఆరోపించిన తర్వాత పోలీసులు అతను కొత్తగా కొనుగోలు చేసిన డ్రైవింగ్ #VolkswagenVirtus గంటకు 200 కిమీ వేగంతో… pic.twitter.com/2b3oCXKNC1
— NewsMeter (@NewsMeter_In) మే 25, 2026

