– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో దర్యాప్తు అధికారులు కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్నారు. వివిధ పోస్టులకు డబ్బులు వసూలు చేసి నియామకాలు జరిపినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 125 మందిని నియమించగా, వీరిలో కొందరి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేసినట్లు సమాచారం. నియామకాలకు సంబంధించిన అధికారిక పత్రాలు పోలీసులకు లభించలేదు. ఎవరి ప్రకారం ఈ నియామకాలు జరిగియో గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై కూడా దృష్టి సారించనున్నారు.
– ప్రకటన –

