– ప్రకటన –
నవతెలంగాణ – ఆత్మకూరు: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం మండల వ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియకు గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా సహకరించాలని స్థానిక తహసీల్దార్ యన్. జగన్మోహన్ రెడ్డి లెక్కలు. బుధవారం మండల ఎంపీడీవో ప్రజాప్రతినిధులకు ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, ఓటరు జాబితా పేర్ల నమోదు, తొలగింపు, సవరణలు పారదర్శకంగా జరిగేందుకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని అన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు బూత్ లెవల్ అధికారులకు సహకరించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో నమోదయ్యేలా చూడాలని సూచించారు. అనంతరం ఎస్ఐఆర్ ప్రత్యేక ట్రైనర్ అజ్మీర రాజారామ్ మాట్లాడుతూ.. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి విధివిధానాలను వివరించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్పై ప్రజాప్రతినిధులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్, ఆర్ఐ మమ్మద్ ఫరూక్, పలువురు సర్పంచులు ముద్దం సాంబయ్య, ఎలుకటి రవి, మందపల్లి మరియ ప్రసాద్, తడక నీరజ శ్రీనివాస్, బీఎల్ఓలు, ఆర్ఐలు ఉన్నారు.
– ప్రకటన –

