హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భగీరథ్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు అనుమతించింది. ఈ మేరకు మూడు రోజుల పాటు భగీరథ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు మంగళవారం (మే 26) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసుల భగీరథను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
కాగా, మైనర్ అమ్మాయిపై దాడికి పాల్పడిన ఆరోపణలపై బండి భగీరథ్‌పై పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా భగీరథ్ జైల్లో ఉన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హై ప్రొఫైల్ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని కస్టడీకి అందించిన పోలీసులు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. పోలీసుల అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం భగీరథ్‌ను మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించింది.

