విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: మదనపల్లె ఇన్టెక్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సం. నిర్వహించిన మిట్స్–2026 ప్రవేశంలో అర్హత సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 27న జూన్ 3వ తేదీ వరకు నిర్వహించిన సెట్ పరీక్ష మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్. డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. బీ, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ మరియు టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాల ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో కౌన్సెలింగ్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడుతుందని సమాచారం. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ, అడ్మిషన్ గైడెన్స్ మరియు సీట్ అలాట్మెంట్ వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, మిట్స్సెట్ స్కోర్ కార్డ్ మరియు గుర్తింపు పత్రాలను తీసుకురావాలని సూచించారు. కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు కళాశాల అధికారిక మిట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి రిజిస్ట్రార్ డాక్టర్. డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రెస్ మీట్ లో ప్రో ఛాన్సుల్లర్ ద్వారకానాథ్, వైస్ ఛాన్సుల్లర్ డాక్టర్ సి. యువరాజ్ లు ఉన్నారు.

