తెలంగాణ:సికింద్రాబాద్లోని ఈగిల్ ఫిషరీస్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు కుళ్లిన చికెన్ నిల్వలు(Stocks of Roten chicken ) గుర్తించినట్లు సమాచారం.ఈ ఘటన వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ప్రజలు చికెన్ కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, శుభ్రత,నిల్వ చేసే విధానం,గడువు తేదీ వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.
ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలను పాటించడం వ్యాపారుల బాధ్యత మాత్రమే కాకుండా, నాణ్యమైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవడం కూడా అని అధికారులు పేర్కొన్నారు.

